జనసేన పద్ధతులు నచ్చాయి, త్వరలోనే పార్టీలో చేరతాను: నరేష్

  • May 30, 2019 / 12:14 PM IST

2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ అంచనాల నడుమ పోలిటికల్ ఎంట్రీ ఇచ్చిన “జనసేన” పార్టీ దారుణంగా ఒడిపోయిన విషయం తెలిసిందే. 60 మంది పోటీ చేయగా కేవలం 1 ఎమ్మెల్యే మాత్రమే గెలిచాడు. దాంతో పవన్ కళ్యాణ్ రాజకీయంగా నెగ్గుకురావడం కష్టమే అని ఫిక్స్ అయిపోయారు చాలామంది. కానీ జనసైనికులు మాత్రం ఒడినా, గెలిచినా కడదాకా పవన్ వెంటే అని ఫిక్సయ్యి జనసేనానికి అండగా నిలిచారు.

నిజానికి జనసేన దారుణమైన ఓటమి అనంతరం పార్టీ క్రేజ్ తగ్గిపోతుందని, కొత్త మెంబర్స్ జాయిన్ అవ్వడం కష్టమని చాలా మంది అనుకొన్నారు. కానీ విశేషంగా ఇప్పుడు పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి సాధారణ జనాలు మాత్రమే కాక.. సెలబ్రిటీలు కూడా ముందుకొస్తుండడం అందర్నీ ఆకట్టుకొంటున్న విషయం. తాజాగా సీనియర్ యాక్టర్ నరేష్ తాను త్వరలోనే జనసేనలో జాయిన్ అవ్వబోతున్నానని ప్రకటించారు. జనసేన పద్ధతులు నచ్చాయని, ఈ ఎలక్షన్స్ లో జనసేన డబ్బులు పంచకుండా పోటీలో నిలిచిన పద్ధతి బాగుందని నరేష్ చెప్పడం అందర్నీ ఆకట్టుకొంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus