ప్రపంచంలోని ప్రముఖ యూనివరిటీల్లో హార్వర్డ్ వర్సిటీ ఒకటి. ఇక్కడి విద్యార్థులకు వివిధ దేశాల్లోని ప్రముఖులతో సమావేశాన్ని నిర్వహిస్తుంటారు. ఇలా ఈసారి హార్వర్డ్ లో జరిగిన ఇండియన్ కాన్ఫెరెన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాధవన్, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పవన్ ప్రసంగం ప్రస్తుత రాజకీయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని పరిష్కరించే ప్రయత్నాలపై అర్ధవంతంగా, ఆలోచనాత్మకంగా సాగింది. ఉత్తరాది, దక్షిణాది అనే అంశాలపైనా కూడా అనర్గళంగా మాట్లాడారు. జనసేన నేత మాటలకు అనేకమంది ఫిదా అయ్యారు.
ఇదే వేదికపై మాట్లాడిన మరో హీరో మాధవన్.. తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. అత్యంత వికాసవంతంగా, సరదాగా ప్రసంగం సాగిందని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అక్కడ ప్రసంగించే అవకాశం రావడం సంతోషమని తెలిపారు. హార్వర్డ్ లోని భారత విద్యార్థులు ఇచ్చిన అతిథ్యం చాలా బాగుందని.. అద్భుతమని అభినందించారు. తన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.