తనకి కాబోయే భర్త గురించి చెప్పి షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్!

  • August 4, 2023 / 05:54 PM IST

మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘అతిథి’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. హీరోయిన్ అమృత రావు స్నేహితురాలి పాత్రలో నటించి పాపులర్ అయిన మాధవీలత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తరువాత తనీష్ హీరోగా వచ్చిన ‘నచ్చావులే’ చిత్రంతో హీరోయిన్ గా మారింది ఈ బ్యూటీ.రవిబాబు దర్శకత్వంలో రూపొందిన ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని తో చేసిన ‘స్నేహితుడా’ చిత్రంలోనూ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది.

ఆ తర్వాత కూడా ఈమె చాలా సినిమాల్లో నటించింది. ఎందుకో ఆ తర్వాత బ్రేక్ తీసుకుంది. అటు తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.2019 ఎన్నికల్లో బిజెపి పార్టీ తరుపున గుంటూరు నుండీ పోటీ పోటీ చేసింది మాధవీలత. ప్రస్తుతం బిజెపి పార్టీలోనే కొనసాగుతుంది.

ఇదిలా ఉండగా.. మాధవీలత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు సామజిక అంశాల పై కూడా ఆమె స్పందిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. త్వరలో ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుందట. ఈ విషయాన్ని స్వయంగా మాధవీలత చెప్పడం విశేషం. ‘నాకు కాబోయే భర్త వివరాలు త్వరలో వెల్లడిస్తాను’ అంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ పెట్టింది. దీంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ అయ్యింది. మాధవీలత పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్లు కూడా మొదలయ్యాయి.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus