ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేతుల మీదుగా ‘మదిలో మది’ టైటిల్ పోస్టర్ విడుదల

స్వచ్చమైన ప్రేమ కథలకు ఎప్పుడూ జనాధరణ ఉంటుంది. ప్రేమకథలు లేని సినిమా అనేది ఉండదు. ఏ జానర్‌లో సినిమాను తీసినా అందులో ప్రేమ కథ ఉండాల్సిందే. అలాంటిది ఓ స్వచ్చమైన ప్రేమ కథను సినిమాగా మలిచితే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అసలే ఇప్పుడు మాస్ మసాలా కమర్షియల్ సినిమాల హడావిడి ఎక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో ఓ ప్యూర్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

‘మదిలో మది’ అంటూ ఓ స్వచ్చమైన ప్రేమ కథతో సినిమా రాబోతోంది. జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించారు. ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్ మీద నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను రామానాయుడు స్టూడియోలో ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్‌ విడుదల చేశారు.

అనంతరం రామ్ లక్ష్మణ్ మాస్టర్లు మాట్లాడుతూ.. టైటిల్ చాలా కొత్తగా ఉంది అని మూవీ టీంని అభినందించారు. ఈ సినిమాకు కథ కథనం మాటలు దర్శత్వం అందించిన ప్రకాష్ పల్ల మాట్లాడుతూ.. ‘ఇప్పుడు వస్తున్న కథలకు భిన్నంగా ఉంటుంది. శ్రీకాకుళం దగ్గర తిలారు అనే గ్రామంలో ఈ సినిమాను తెరకెక్కించాం. లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సరికొత్తగా ఉంటుంది. మదిలో మది మూవీ టీంని ఎంకరేజ్ చేస్తూ డిస్క్వేర్ అకాడమీ ధనరాజ్ మాస్టర్ గారు సపోర్ట్‌గా నిలిచారు. ఈ కథ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని తొందరలోనే మీ ముందుకు వస్తుంది’ అని అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus