నైజాంలో దూసుకుపోతున్న ‘మహర్షి’..!

  • May 16, 2019 / 11:40 AM IST

మహేష్ బాబు 25 వ చిత్రంగా వచ్చిన ‘మహర్షి’ వీక్ డేస్ లో మంచి కలెక్షన్లను రాబడుతుంది. ముఖ్యంగా నైజాంలో రికార్డు కలెక్షన్లను నమోదు చేస్తుంది. రిలీజ్ అయ్యి 6 రోజులు గడుస్తున్న నైజాంలో ‘మాహర్షి’ కలెక్షన్స్ స్టడీగా ఉండడం విశేషం. ఇప్పటికే నైజాంలో మహర్షి బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చేసింది. ఈ వీకెండ్ కు బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు బలంగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సీడెడ్ మినహాయిస్తే అన్ని ఏరియాల్లోనూ మంచి కల్లెక్షన్లనే నమోదుచేస్తుంది. ఇక మాహర్షి నైజాంలో 6వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

మంగళవరం నాడు ‘మహర్షి’ చిత్రం నైజాంలో 1.53 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తం ఆరు రోజులకు గానూ 20.54 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తానికి నైజాంలో మహేష్ మార్కెట్ రేంజ్ ‘మహర్షి’ ఏంటనేది మరోసారి ప్రూవ్ అయ్యింది. గతంలో కూడా మహేష్ సూపర్ హిట్ చిత్రాలు నైజాంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళను సాధించాయి. అయితే ‘మహర్షి’ వాటన్నిటినీ క్రాస్ చేయడం విశేషం. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి ఎంత వరకూ కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus