తమిళనాడులో విడుదలకు సిద్ధమైన మహేష్ బాబు మూవీ

  • January 25, 2017 / 10:28 AM IST

తెలుగులో తప్ప ఇతర ఏ భాషలో నటించని సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారి తమిళంలో స్ట్రైట్ మూవీ చేస్తున్నారు. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ద్వి భాష చిత్రంలో ప్రిన్స్ నటిస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెలుగు వారు మాత్రమే కాకుండా, తమిళీయులు ఎదురుచూస్తున్నారు. ప్రిన్స్ గత చిత్రాలు దూకుడు, 1 నేనొక్కడినే తమిళంలోకి అనువాదం అయి మంచి కలక్షన్స్ సాధించాయి. కాబట్టి మహేష్, మురుగ దాస్ కలయికలో వస్తున్న సినిమాపై కోలీవుడ్ లోను భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రం రిలీజ్ అవ్వడానికి మరికొన్ని నెలలు సమయం ఉండడంతో అక్కడి ఫ్యాన్స్ కోసం మహేష్ మొదటి సినిమా రాజకుమారుడు ని తమిళంలో డబ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో  రూపుదిద్దుకున్న ఈ మూవీ ‘తునిచల కారన్’ అనే పేరుతో జనవరి 27 న విడుదలకు సిద్దమయింది.  పదిహేడేళ్ల తర్వాత అనువాదమైన రాజకుమారుడు ఎంత మేర వసూళ్లు సాదిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus