సీఎం కుర్చీ ఎక్కనున్న మహేశ్!

  • September 26, 2016 / 06:05 AM IST

రాజకీయాలు తనకి సరిపడవని మహేశ్ ఎప్పుడో తేల్చి చెప్పారు. ‘దూకుడు’లో ఎమ్మెల్యే గా డ్రామా ఆడిన కొన్ని సన్నివేశాలు తప్పిస్తే సినిమాల్లోనూ ఇప్పటివరకు మహేశ్ ఖద్దరు కట్టనే లేదు. అలాంటిది మహేశ్ సీఎం కుర్చీ ఎక్కుతున్నారంటే అందరిలోనూ విషయమేంటో తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉంటుంది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తోన్న మహేశ్ తర్వాతి సినిమాలో సీఎంగా కనపడనున్నారట.మురుగదాస్ తో చేయనున్న ద్విభాషా చిత్రం పూర్తైన వెంటనే కొరటాల శివతో మహేశ్ మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

“ఓ వ్యక్తి సాదా సీదాగా బ్రతకడం” అన్న కథాంశంతో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఆ వ్యక్తి ఓ మామూలు మనిషి అయితే అందులో గొప్పతనం ఏముంటుంది. అదే ఓ అసాధారణ వ్యక్తి సాధారణ జీవితం గడిపితే ఎలా ఉంటుంది. ఖచ్చితంగా ఆసక్తిగా ఉంటుంది. కొరటాల కాన్సప్ట్ కూడా ఇదేనట. అందుకే మహేశ్ ని ముఖ్యమంత్రిగా చూపిస్తూ వ్యక్తిగత జీవితం మాములుగా సాగించడంలో ఉండే అనుభవాలను తెరపై ఆవిష్కరించనున్నారు. ఓ రకంగా శ్రీమంతుడు సినిమాలోను మహేశ్ పాత్రని ఇదే విధంగా మలిచిన కొరటాల కథని మట్టుకు “దత్తత” పేరుతో సమాజానికి ముడిపెట్టారు. ఈ సినిమాలో వ్యక్తిగత జీవితంపై దృష్టి సారిస్తున్నారు. అదీ విషయం..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus