AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

టాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన మహేష్ బాబు సినిమాలతోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. తెరపై భారీ విజయాలను అందుకుంటూనే, సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెట్టి స్మార్ట్ ఇన్వెస్టర్‌గా మారుతున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ రంగంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.

AMB Cinemas

హైదరాబాద్‌లో ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ప్రారంభించిన AMB సినిమాస్ ప్రేక్షకులకు అద్భుతమైన థియేటర్ అనుభవాన్ని అందిస్తూ మంచి పేరు సాధించింది. ఈ విజయం తరువాత ఈ బ్రాండ్‌ను మరింత విస్తరించాలని మహేష్ బాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెంగళూరులో అత్యాధునిక సదుపాయాలతో కూడిన మల్టీప్లెక్స్ ప్రారంభించగా, ఇప్పుడు ఆయన దృష్టి ఇతర నగరాలపై పడినట్లు సమాచారం.

ప్రస్తుతం విశాఖపట్నంలో కూడా భారీ మల్టీప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో బెంగళూరు ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతంలో మరో ప్రాజెక్ట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, భవిష్యత్తులో కేరళ, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో కూడా ఈ బ్రాండ్‌ను విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా విశాఖలో మాల్ మరియు మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తుండటంతో, ఈ నగరం సినిమా వ్యాపారానికి పెద్ద కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే, మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్‌ ‘వారణాసి’ నటిస్తున్నారు. గ్లోబల్ స్థాయిలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ కథలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్విరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి మహేష్ బాబు ఒక వైపు భారీ సినిమాలు చేస్తూనే, మరో వైపు వ్యాపార రంగంలో విస్తరణపై దృష్టి పెట్టడం ఆయన దూరదృష్టిని మరోసారి స్పష్టంగా చూపిస్తోంది. సినిమాల్లోనే కాదు, బిజినెస్‌లో కూడా విజయాలను అందుకోవాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు.

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus