మహేష్ రాజమౌళికి ఎందుకు థాంక్స్ చెప్పారంటే ?

  • May 8, 2017 / 10:21 AM IST

తెలుగు ప్రజలందరూ గర్వించే సినిమా బాహుబలిని తెరకెక్కించిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి సూపర్ సూపర్ స్టార్ మహేష్ బాబు కృతజ్ఞతలు చెప్పారు. బాహుబలి కంక్లూజన్ ని విడుదల రోజే చూసిన మహేష్  “అమోఘం గా వెండి తెరపై కథలను చెప్పగలిగే రాజమౌళి తిరిగి వచ్చారు. బాహుబలి 2 అంచనాలకు మించి ఉంది.” మైండ్ బ్లోయింగ్ స్టఫ్ ఇందులో ఉంది. రాజమౌళికి, అతని బృందానికి హ్యాట్సాఫ్” అని ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ మూవీ పది రోజుల్లో వెయ్యికోట్లు కొల్లకొట్టడంతో  ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని ఈరోజు తన ట్వీట్స్ రూపంలో వెల్లడించారు. ” ఎవరూ ఊహించని విధంగా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ‘బాహుబలి’కి అభినందనలు. అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేసినందుకు రాజమౌళికి, ఆయన టీమ్‌కీ ‘థ్యాంక్స్‌” అని మహేష్ ట్వీట్ చేశారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus