తెలుగు సినీ ప్రేక్షకులు తమ హీరోల నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా స్టార్స్ కథ, కథనం నుంచి వేషం, భాష వరకు అంతా మార్చేస్తున్నారు. విలన్ గా నటించడానికి సైతం ఇష్టపడుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ద్వి పాత్రాభినయం చేయడానికి ఒప్పుకున్నారు. చిన్నప్పుడు కొడుకులు దిద్దిన కాపురం సినిమాలో డ్యూయల్ రోల్ పోషించారు. హీరో గా మారిన తర్వాత అలాంటి ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న మూవీలో తొలిసారి రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నారు.
“భరత్ అను నేను” అనే టైటిల్ ఖరారు చేసిన ఈ మూవీ షూటింగ్ మహేష్ బాబు లేకుండా సాగుతోంది. జూబ్లీహిల్స్‌లోని ఓ భవంతి సెట్లో మహేశ్ పాత్ర చిన్నప్పటి సన్నివేశాలను మాస్టర్ జాయ్ పై తీస్తున్నారు. జూన్ 16 నుంచి ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్లో మహేష్ పాల్గొననున్నారు. ఇందులో మహేష్ ఎన్ఆర్ఐ పాత్రలో క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోనుండగా, రెండోది రాజకీయనాయకుడి పాత్రలో మాస్ ఆడియన్స్ ని అలరించనున్నారు. ఇలా క్లాస్ , మాస్ కలగలిపి విజయాన్ని అందుకోనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.