మా కాంబినేషన్ లో మళ్ళీ మళ్ళీ సినిమాలు వస్తూనే ఉంటాయి.!

  • April 24, 2018 / 05:44 AM IST

కొన్ని విజయాలు కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు అంతకు మించిన సంతృప్తిని కూడా ఇస్తుంటాయి. అలాంటి సంతృప్తితో కూడిన ఆనందాన్ని అనుభవిస్తున్నారు “భరత్ అనే నేను” టీం అందరూ. సినిమా గత శుక్రవారం విడుదలై మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకొని అన్నీ ఏరియాల్లో రికార్డులను కొల్లగొడుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిన్న సాయంత్రం హైద్రాబాద్ లో ఫిలిమ్ యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో యూనిట్ సభ్యులందరూ పాల్గొని తమ ఆనందాన్ని పంచుకొన్నారు.

ముఖ్యంగా మహేష్ ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా ఒక పబ్లిక్ మీట్ లో ఎమోషనల్ అయిపోయాడు. కొరటాలను మనస్ఫూర్తిగా కౌగిలించుకొని తనకు బ్యాడ్ ఫేస్ లో ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. అలాగే.. కొరటాల దర్శకత్వంలో ఆయనకి కుదిరినప్పుడల్లా తాను సినిమాలు చేస్తూనే ఉంటానని మహేష్ పేర్కొనడం విశేషం.

ఇకపోతే.. మార్చి 27న “భరత్ అనే నేను” విజయోత్సవ సభను తిరుపతిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. తమ చిత్రాన్ని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు అందరికీ పేరుపేరునా కృతజ్నతలు చెప్పడమే ఈ బహిరంగ సభ ముఖ్య ధ్యేయమని మహేష్ పేర్కొనడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus