గూఢచారి బ్యూటీపై విరుచుకు పడ్డ మహేష్ అభిమానులు

  • August 9, 2018 / 01:47 PM IST

ఇదివరకు కరుకైన మాటలు, వ్యగ్యంతో కూడిన వ్యాఖ్యలు వివాదాలను సృష్టించేవి. ఇప్పుడు పొట్టి పొట్టి ట్వీట్స్ గొడవలకు కేంద్ర బిందువవుతున్నాయి. రీసెంట్ గా అరవింద సమేత వీర రాఘవ సినిమాలో భాగమైనందుకు ఆనందంతో ఆదర్శ్ త్రివిక్రమ్ కి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో త్రివిక్రమ్ ని సార్ అని గౌరవించిన ఆదర్శ్ ఎన్టీఆర్ ని కనీసం “గారు” అని కూడా మర్యాద ఇవ్వకపోవడంతో అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. యువ దర్శకుడు శశికాంత్‌ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన గూఢచారి గత శుక్రవారం రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. ఈ సినిమాని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్ర బృందాన్ని ట్విట్టర్ వేదికపై ప్రశంసించారు.

“తెలుగులో స్పై థిల్లర్ కథను ప్రయత్నించిన గూఢచారి బృందం అందరినీ మెప్పించింది. కథ, కథనం చాలా వేగంగా, ఉత్కంఠంగా సాగింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ చక్కగా నటించారు. అడవి శేషు అయితే అన్నివిధాలుగా ఆకట్టుకున్నారు.” అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు చిత్ర బృందం ఎంతో సంతోషించింది. హీరోయిన్ గా నటించిన శోభిత ధూళిపాల మహేష్ ట్వీట్ కు కృతజ్ఞతగా “థ్యాంక్ యు” అని రిప్లయ్ ఇచ్చింది. దీంతో మహేష్ అభిమానులు హర్ట్ అయ్యారు. కనీసం గౌరవం ఇవ్వకుండా ఆ సమాధానమేంటి? అని విరుచుకు పడుతున్నారు. ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శోభిత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus