Mahesh Babu : ఇదేంటి అతడు విలన్ రాహుల్ దేవ్.. మహేష్ బాబు ని అంత మాట అన్నాడు !

Advertisement

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో మహేష్ కెరీర్, ఆయన బాలీవుడ్ ఎంట్రీపై జరిగిన చర్చలో రాహుల్ దేవ్ చేసిన కామెంట్స్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీశాయి.

Mahesh Babu

తెలుగు ప్రేక్షకులకు అతడు, పౌర్ణమి వంటి చిత్రాల ద్వారా బాగా పరిచయమైన రాహుల్ దేవ్, ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, ఆయన సినిమాల ఎంపిక, స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ చేసిన సినిమాలకు ప్రత్యేకమైన స్టైల్ ఉంటుందని పేర్కొన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌కు భావోద్వేగాలను జోడించే కథలు మహేష్‌కు బాగా సెట్ అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఎంట్రీ అంశం ప్రస్తావనకు రావడంతో చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. గతంలో మహేష్ చేసిన “Bollywood can’t afford me” వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు, రాహుల్ దేవ్ సరదాగా స్పందిస్తూ అసలు మహేష్ కి హిందీ రాదని కామెంట్స్ చేశారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలను కొందరు సరదాగా తీసుకుంటే, మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో దీనిపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా మహేష్ అభిమానులు ఆయన హిందీ మాట్లాడే పాత వీడియోలను షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి, రాహుల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి మహేష్ బాలీవుడ్ కామెంట్స్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చాయి. సోషల్ మీడియాలో ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus