ఆ కలర్ షర్ట్ మహేష్ కి ఈ సారి విజయాన్ని ఇస్తుందా?

  • February 1, 2018 / 01:14 PM IST

శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన కాంబినేషన్లో భరత్ అనే నేను తెరకెక్కుతోంది. అలాంటి హిట్ మళ్ళీ రావాలని కొరటాల శివ మ్యూజిక్ డైరక్టర్ ని కూడా మార్చలేదు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ నే తీసుకున్నారు. అతను అదిరిపోయే సంగీతం ఇస్తాడనే  విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే మహేష్ బాబు కూడా తన సెంటిమెంట్ ని ఈ సినిమాకి జోడించారు. అది ఏమిటంటే…  రిపబ్లిక్ డే సందర్భంగా “భరత్ అనే నేను”  సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వాయిస్‌ ని రిలీజ్ చేశారు. అలాగే ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. సీఎం ఛాంబర్ నుంచి చేతిలో బ్యాగ్ పట్టుకుని మహేశ్  వస్తున్న ఈ ఫోటో బ్యాక్ డ్రాప్‌లో ఓ వైపు గాంధీ, మరోవైపు అంబేద్కర్ ఫొటోలను గమనించి వుంటారు.

మహేష్ బ్లూ కలర్ షర్ట్ ని పెద్దగా పట్టించుకోని ఉండరు. ఆ కలర్ షర్ట్ వెనుక మహేష్ ఇష్టం, సెంటిమెంట్ దాగుంది. బ్లూ కలర్ అంటే మహేష్ చాలా ఇష్టం. తన సినిమాలో ఆ కలర్ షర్ట్ ఒకసారైనా వేసుకుంటారు. శ్రీమంతుడు సినిమాలోనే కాదు బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాల్లో ఆ షర్ట్ వేసుకున్నారు. అయితే ఈ రెండు ఫెయిల్ అయినప్పటికీ బ్లూ షర్ట్ ని వదలలేదు. తన కిష్టమైన కలర్ హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు. అందుకే భరత్ అనే నేను మూవీ ఫస్ట్ లుక్ గా ఈ స్టైల్ ని రిలీజ్ చేయాలనీ చెప్పారంట. మరి ఈ సారైనా మహేష్ కి బ్లూ కలర్ కలిసి వస్తుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus