‘జ్యో అచ్యుతానంద’ ఇంట మహేష్ సందడి!

  • September 15, 2016 / 06:17 AM IST

శ్రీనివాస్ అవసరాల ప్రతిభను చాటుతూ ఇటీవల తెరమీదికొచ్చిన ‘జ్యో అచ్యుతానంద’ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ ఘన విజయంవైపు దూసుకెళుతోంది. ఈ సినిమాలో కదలాడే పాత్రలతో పాటు ఓ ఇల్లు కూడా ముఖ్య పాత్ర పోషించింది. ఆ ఇంటి గురించి అవసరాల రాసిన సంభాషణ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఇప్పుడు అదే ఇంట్లో సూపర్ స్టార్ మహేష్ తిరుగాడనున్నాడు.

మురుగదాస్ – మహేశ్ కలయికలో రానున్న చిత్రం ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ ప్రకారం 90ల్లో నిర్మించిన ఓ ఇంట్లో మహేశ్ ఉండాలట. చాలా సన్నివేశాలు ఆ ఇంట్లో చిత్రీకరిస్తారట. అందుకోసం తగిన ఇళ్ళు వెతికి తీరా సెట్ వేయిద్దామని నిర్ణయించుకున్న తరుణంలో జ్యో అచ్యుతానంద కోసం వేసిన ఇంటిని పరిశీలించారట. అన్నివిధాలా ఇదే సరైందని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

మొన్నటికి మొన్న ‘జనతా గ్యారేజ్’ కోసం వేసిన గ్యారేజ్ సెట్ ని మహేశ్ వాడనున్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు ఇది. దీనివల్ల నిర్మాణ పరంగా సమయం, సొమ్ము రెండూ ఆదా అవుతాయి. ఈ పధ్ధతి తర్వాతి సినిమాల్లోను కనిస్తుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus