మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్ మూవీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుంది. మహేష్ కొన్ని రోజులు కూడా రెస్ట్ తీసుకోకుండా నెక్స్ట్ ప్రాజక్ట్ ని మొదలెట్టేసారు. కొరటాల శివతో సినిమా ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయింది. ఈనెలాఖరు వరకు సాగే మొదటి షెడ్యూల్లో నటుడు శరత్ కుమార్, మహేష్ లపై పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ముఖ్యమంత్రిగా మహేశ్ నటించే ఈ సినిమాకి “భరత్ అను నేను” అని పేరుని ఖరారు చేశారు.
డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి రెండో షెడ్యూల్ ని జూన్లో ప్లాన్ చేశారు. ఆగస్ట్ షెడ్యూల్ లండన్లో ఉంటుంది. ఈ చిత్రం ద్వారా కైరా అద్వానీ (ధోనీ ఫేమ్) తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ సినిమా కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే మూడు పాటలకు స్వరాలు కూర్చారు. వచ్చే ఏడాది సంక్రాంతికి భరత్ అను నేను థియేటర్లోకి రానున్నాడు. శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న రెండో మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.