25వ సినిమాకి అదరగొట్టే గెటప్ ట్రై చేస్తున్న ప్రిన్స్

Advertisement

మహేష్ బాబు తన కెరీర్ లో అత్యంత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నటిస్తున్న చిత్రంగా “మహేష్ 25వ” చిత్రం నిలిచిపోతుందేమో. “ఖలేజా” అనంతరం మహేష్ బాబు ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్న సినిమా ఇదే. “భరత్ అనే నేను” విడుదలై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకూ తన తదుపరి చిత్రం షూటింగ్ మొదలెట్టలేదు మహేష్. అయితే.. గత నాలుగైదు సినిమాల్లో ఒకేరకమైన హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల జనాలు కాస్త ఎక్కువగా ట్రోల్ చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొన్న మహేష్ తన 25వ సినిమా కోసం కంప్లీట్ డిఫరెంట్ ఛేంజోవర్ కోసం ట్రై చేస్తున్నాడు. అందుకే గెడ్డం కూడా పెంచుతున్నాడు. “టక్కరి దొంగ” అనంతరం మహేష్ బాబు గెడ్డం లుక్ లో కనిపించబోయేది ఈ సినిమాలోనే.

ఇవాళ ఉదయం ముంబై ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు గెడ్డం లుక్ లో కనిపించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అయ్యింది. నూనుగు గెడ్డాలతో మహేష్ బాబును చూస్తిన ఘట్టమనేని అభిమానులు మురిసిపోతున్నారు. గెడ్డం లుక్ లో మా రాజకుమారుడు భలే ఉన్నాడు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనుండగా.. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించనున్నారు. జూన్ ఎండింగ్ లేదా జూలై మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus