ఫ్యాన్స్ కి ప్రామిస్ చేసిన మహేష్ బాబు.!

  • April 9, 2018 / 12:14 PM IST

భరత్ అనే నేను‘ టీజర్ విడుదలైనప్పుడు.. సదరు టీజర్ లోని ‘ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే.. “యు ఆర్ నాట్ కాల్డ్ ఏ మ్యాన్”, ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు.. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటోచ్చింది. పెద్దదే కాదు కష్టమైంది కూడా. కానీ.. ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. బికాజ్ ఐయామ్ ఏ మ్యాన్” అనే డైలాగ్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకొంది. ఈ డైలాగ్ ను చాలా మంది చాలా మందికి అనుకరించారు. అయితే.. ఇప్పుడు ఈ డైలాగ్ ను మహేష్ బాబు ఓన్ చేసుకొన్నాడు. అందుకే “భరత్ బహిరంగ సభ”కు భారీ స్థాయిలో విచ్చేసిన అభిమానులందరికీ కృతజ్నతలు చెబుతూ.. “ఏప్రిల్ 20న మీరు గర్వపడేలా చేస్తాను” అంటూ ప్రామిస్ చేశాడు.

ఇప్పటివరకూ మహేష్ ఈ స్థాయిలో తాను నటించిన ఏ సినిమా మీద కాన్ఫిడెన్స్ గా లేడు. అయితే.. మరి తనకు “శ్రీమంతుడు” లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల మీద నమ్మకామో లేక సినిమా మీద నమ్మకామో అభిమానులకు ప్రామిస్ చేసేశాడు మహేష్ బాబు. సో, మహేష్ తన మాట నిలబెట్టుకొని “మ్యాన్” అవ్వాలని అందరూ కోరుకొంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus