రాజమౌళి, మహేష్ సినిమాకి ముహూర్తం ఫిక్స్

  • September 27, 2019 / 06:06 PM IST

‘మహేష్-రాజమౌళి ఈ కాంబినేషన్లో సినిమా వస్తే బాగుణ్ణు’ అని ఒక్క మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. టాలీవుడ్ ప్రేక్షకులు మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఆ సినిమా ఎన్ని రికార్డులు కొడుతుంది…’ అనే విషయం పక్కన పెడితే హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని మహేష్ ను రాజమౌళి ఎలా చూపిస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇక ఇప్పటి వరకూ రాజమౌళి డైరెక్షన్లో సినిమాలు చేసిన హీరోలు స్టార్లు అయ్యారు కానీ ఓ స్టార్ హీరోని రాజమౌళి డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆసక్తిని పెంచే అంశం.

ఈ క్రమంలో మహేష్, పవన్ కళ్యాణ్ లతో రాజమౌళి సినిమా ఎప్పుడు ఉంటుంది అనే వార్త ఊరిస్తూనే ఉంది. ఇక మహేష్ తో రాజమౌళి సినిమా ని కె.ఎల్. నారాయణ్ నిర్మిస్తాడని మహేష్ పలు సార్లు చెప్పాడు. అలాగే రాజమౌళి కూడా మహేష్ తో జేమ్స్ బాండ్ తరహా నేపథ్యంలో ఉండే కథ అయితేనే బాగుంటుందని చెప్పాడు. ఇప్పుడు ఆ దశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. 2020 ఆగష్టు లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్క బోతుందనే టాక్ బలంగా వినిపిస్తుంది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus