ఆ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కు మహేష్ సర్ప్రైజ్ గిఫ్ట్..!

మహేష్ డైరెక్టర్స్ అందరికీ కొత్త ఎనర్జీ ఇస్తుంటాడు అని ఇప్పటికే పలువురు దర్శకులు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తన సినిమాకి మాత్రమే కాదు.. మిగిలిన హీరోల సినిమాలని కూడా అభినందిస్తూ మహేష్ బాబు ఎప్పుడూ ట్వీట్ లు చేస్తుంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ దీపావళి రోజున మహేష్ ఓ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ను సర్ప్రైజ్ చేసాడు. ఆ ట్యాలెంటెడ్ డైరెక్టర్ మరెవరో కాదు శ్రీరామ్ ఆదిత్య. మహేష్ బావ సుధీర్ బాబుతో ‘భలే మంచి రోజు’ చిత్రం ద్వారా పరిచయమైన శ్రీరామ్ ఆదిత్య తరువాత ‘శమంతకమణి’ ‘దేవదాస్’ చిత్రాలతో కూడా ప్రేక్షకులని అలరించాడు.

తరువాత ఈ డైరెక్టర్ మరో సినిమాని ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల మహేష్ బాబు తన హంబుల్ అనే క్లాతింగ్ బ్రాండ్ ను లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. హంబుల్ నుండి మహేష్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు గిఫ్ట్ పంపాడు. గిఫ్ట్ తో పాటు దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియచేసాడు మహేష్. ఇక మహేష్ బాబు పంపిన గిఫ్ట్స్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య.. “సర్.. చాలా థాంక్స్ .. మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా దీపావళి శుభాకాంక్షలు” అంటూ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus