సూపర్ లుక్ తో అదరగొట్టిన సూపర్ స్టార్

టాలీవుడ్ లో ఎక్కువ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న హీరో ఎవరంటే ?.. సూపర్ స్టార్ మహేష్ బాబు అనే సమాధానం వస్తుంది. అది అతనికి దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ కి నిదర్శనం. అయితే ఏ సంస్థ వెల్లడించని విషయం మరొకటి ఉంది. అదే అందానికి బ్రాండ్ అంబాసిడర్ మహేష్ అని. అవును ఈ విషయాన్ని తాజా ఫోటో ఒకటి చాటిచెప్పింది. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ రీసెంట్ గా మహేష్ బాబు తో ఫోటో షూట్ నిర్వహించారు. ఆ మోనోక్రోమ్ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంటూ “పోస్ట్ ప్యాక్ అప్ షూట్ విత్ ద సూపర్ ఛార్మింగ్ సూపర్ ఫాస్ట్ సూపర్ స్టార్.. మహేష్ బాబు” అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఫోటో ఎలా ఉంది అంటే “మహర్షి” బియర్డ్ లుక్ కావడంతో బ్లాక్ అండ్ వైట్ ఫొటో కొత్తగా ఉంది.

ఇక ఫోటోలో హైలైట్ ఏంటి అంటే మహేష్ కళ్లలో కనిపించిన మెరుపు. సహజంగా ఎవరైనా ఆనందంగా కనిపించినప్పుడు కళ్ళల్లో మెరుపు కనిపించిందని అంటుంటారు. ఇక అవినాష్ గోవారికర్ మాత్రం మహేష్ కళ్ళలో మెరుపు అందరికీ కనిపించేలా ఫోటో తీసి అనుభవం ఉన్న ఫోటోగ్రాఫర్ గా నిరూపించుకున్నారు. ఇదే ఫోటోని మహేష్ కూడా తన ఇంస్ట్రా గ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. “మీ స్టైల్ ఆఫ్ వర్క్ నచ్చింది. మీతో వర్క్ చేయడం ఎప్పుడూ సూపర్ ఫన్. మీ సూపర్ స్పెషల్ మహారాష్ట్రియన్ లంచ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేశాను” చెప్పారు. ఈ ఫోటో మహేష్ అభిమానులకే కాదు.. ఇతర హీరో అభిమానులకు సైతం నచ్చింది. విపరీతమైన లైకులు షేర్లు అందుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus