మాస్ ఫ్యాన్స్ కోసం సిక్స్ ప్యాక్ చూపించనున్న మహేష్

  • June 29, 2018 / 07:39 AM IST

అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు సిక్స్ ప్యాక్ చూపించి అదరగొట్టారు. తాజాగా అరవింద సమేత వీర రాఘవ సినిమా కోసం సిక్స్ ప్యాక్ రప్పించి ఔరా అనిపించారు. ఫస్ట్ లుక్ తోనే పిచ్చెక్కించారు. అదేవిధంగా ఈ సారి మహేష్ బాబు కూడా సిక్స్ ప్యాక్ చూపించనున్నారంటూ ఫిలిం నగర్లో వార్త చక్కర్లు కొడుతోంది. గడ్డం లుక్ లో మహేష్ ని చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకున్నారు. పైగా యాంటీ అభిమానులు మహేష్ ని అమూల్ బేబీ అంటూ ఎగతాళి చేసేవారు. వారందరికీ లేటెస్ట్ బియర్డ్ లుక్ తో బుద్ధి చెప్పారు. కొత్త లుక్ మహేష్ ఫ్యాన్స్ కి భలే నచ్చింది. ఈ లుక్ తోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్ లో సాగుతోంది. అతను వేసిన షర్ట్స్ కూడా ఇప్పుడు ట్రెండ్ సృష్టిస్తున్నాయి.

అలాగే తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన చిత్రం కోసం షర్ట్ విప్పుతారని సమాచారం. ఇప్పటివరకు మహేష్ షర్ట్ లెస్ గా కనిపించలేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించాలని తపించారు. కానీ కుదరలేదు. అందులో స్నానం చేసినప్పుడు వీపు భాగం మాత్రమే చూపించారు. ఇప్పుడు ఏకంగా సిక్స్ ప్యాక్ చూపించడానికి మహేష్ ఫిక్స్ అయ్యారని తెలిసింది. అందుకోసమే బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ ని నియమించుకున్నారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో సిక్స్ ప్యాక్ రూమర్లను బలపరుస్తోంది. మరి మహేష్ ఈసారి ఆశ్చర్యపరుస్తాడేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus