రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర .. ఈ ముగ్గురు మిత్రులు కలిసి ఏర్పాటు చేసిన సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్. ఈ బ్యానర్లో మొదట విక్టరీ వెంకటేష్ తో నమో వెంకటేశా సినిమా మొదలు పెట్టారు. ఆ తర్వాత మహేష్ బాబుతో వరుసగా రెండు సినిమాలు చేశారు. ఇందులో దూకుడు హిట్ కాగా 1 నేనొక్కడినే నిరాశ పరిచింది. తర్వాత లెజెండ్, పవర్ సినిమాలతో ఆర్ధికంగా నిలబడి భారీ బడ్జెట్ తో ఆగడు సినిమా నిర్మించారు. ఇది భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆ సమయంలో నిర్మాతలకు మహేష్ బాబు మాట ఇచ్చారంట. మీ బ్యానర్లో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పారంట. ఆమాట ఏళ్ళు ఇచ్చిన అయన మరిచి పోలేదు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి నిర్మించిన హైపర్, లై చిత్రాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో వారు రీసెంట్ గా మహేష్ ని కలిసారని ఫిలిం నగర్ వాసులు చెప్పారు.
సినిమా చేద్దామని మహేష్ ఒకే చెప్పడంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చేస్తున్నారు. ఆ తర్వాత వంశీ పైడి పల్లి మూవీ మొదలుకానుంది. ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. వీటి తర్వాత మహేష్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మూవీ మొదలుకావొచ్చు.