తండ్రి కృష్ణగా కనిపించబోతున్న మహేష్ బాబు

  • June 26, 2018 / 01:03 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ మధ్య ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు అనేకం ఉన్నాయి. అయినా వాటిని ఇంతవరకు రీమేక్ చేయలేదు. కనీసం కృష్ణ పాటలను సైతం టచ్ చేయడానికి సాహసించలేదు. ఇక తండ్రిగా కనిపించడమంటే.. అసలు అలా అడగడానికి కూడా ఎవరూ సాహసించలేదు. కానీ తొలిసారిగా మహేష్ తండ్రిగా కనిపించబోతున్నారు. తెలుగు చిత్ర తొలినాళ్లలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ మధ్య త్రిముఖ పోటీ ఉండేది. ఎన్టీఆర్ పౌరాణిక కథల బాట పడితే.. అక్కినేని నాగేశ్వరరావు సాంఘిక చిత్రాలతో విజయాలు అందుకున్నారు.

ఇక కృష్ణ కౌ బాయ్ చిత్రాలతో సాహస వీరుడిగా పేరు దక్కించుకున్నారు. టాలీవుడ్ లో అనేక విప్లవాత్మక మార్పులకు ఆయనే కారణం. సో ఎన్టీఆర్ జీవితం గురించి చెప్పాలంటే ఏఎన్నార్, కృష్ణ గురించి తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది. అందుకే క్రిష్ తాను తెరకెక్కించనున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ గా నాగ చైతన్యని సెలక్ట్ చేశారు. కృష్ణ పాత్రకు మహేష్ మాత్రమే న్యాయం చేయగలరని చెప్పడంతో స్వయంగా బాలకృష్ణ మహేష్ వద్దకు పోయి నటించమని కోరినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. బాలయ్య అడిగితే మహేష్ కాదనలేకపోయినట్లు తెలిసింది. ఈ విషయం కనుక నిజమైతే ఎన్టీఆర్ బయోపిక్ కి ఓ రేంజ్ లో క్రేజ్ రావడం గ్యారంటీ. ఆ శుభవార్తని అధికారికంగా వినడానికి కృష్ణ అభిమానులు, నందమూరి అభిమానులు వేయిచెవులతో ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus