ఎయిర్ పోర్ట్ లో 5 గంటల వెయిటింగ్, పర్మిషన్ లేదని క్యాన్సిల్

మహేష్ బాబు మంచోడు కాబట్టి సరిపోయింది కానీ.. ఇదే సిచ్యుయేషన్ లో మరో హీరో ఉండి ఉంటే పెద్ద పెంట అయిపోయేది. ఇంతకీ ఏంటా సిచ్యుయేషన్ అని ఆలోచిస్తున్నారా.. ప్రస్తుతం మహర్షి షూటింగ్ హైద్రాబాద్ లోనే జరుగుతోంది. మహేష్ బాబు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చే సన్నివేశమొకటి షూట్ చేయడం కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పర్మిషన్ తీసుకున్నారు. మహేష్ బాబు మేకప్ తో సహా సెట్స్ కి వచ్చేశాడు. ఇంకో అరగంటలో షాట్ అనుకున్న సమయానికి ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ వచ్చి షూటింగ్ కాసేపు ఆపండి అని చెప్పేసి వెళ్ళిపోయారు.

అక్కడ ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు.. ఇదేంటి షూటింగ్ ఆపమన్నారు అని హైయర్ అఫీషియల్స్ అని అడగగా.. “ఫ్లైట్ హైజాకింగ్ థ్రెట్ కాల్ వచ్చిందని, అది క్లియర్ అయ్యేవరకూ షూటింగ్ చేయకూడదని చెప్పేశాడు”. దాంతో షాక్ అవ్వడం మహర్షి టీం వంతయ్యింది. దాదాపు అయిదు గంటలు వెయిట్ చేసినా కూడా సిచ్యుయేషన్ లో ఎలాంటి మార్పు లేకపోవడంతో షూటింగ్ క్యాన్సిల్ చేశారు. దాంతో.. టీం మెంబర్స్ అందరూ.. “మహేష్ బాబు కాబట్టి వెయిట్ చేశాడు కానీ.. వేరే హీరో అయితే ఎప్పుడో వెళ్లిపోయేవాడు” అని మహేష్ పై ప్రశంసలు కురిపించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus