సెలవు లేకుండా పనిచేస్తున్న మహేష్ బాబు

  • April 4, 2017 / 06:40 AM IST

వేసవి సెలవులు అనగానే షూటింగ్ ని పక్కన పెట్టి, భార్య, పిల్లలతో కలిసి విదేశాల్లో విహరించడం మహేష్ బాబు కి అలవాటు. వేసవి వచ్చేసినా ఈ సారి ప్రిన్స్ ఆ ఊసే ఎత్తడం లేదు. కారణం అభిమానులు. ఆశ్చర్యం గా ఉంది కదూ.. అవును నిజంగా ఫ్యాన్సే. బ్రహ్మోత్సవం అపజయం పాలవడంతో మహేష్ అభిమానులు ఎంతో నిరాశ చెందారు.  ఆ తర్వాత సూపర్ స్టార్ మురుగదాస్ తో మూవీ చేస్తున్నారన్న వార్త కొంత ఊరట కలిగించినా, ఆ సినిమా పేరుని కూడా బయట పెట్టకపోవడంపై కోపంగా ఉన్నారు. వారి కోపాన్ని చల్లార్చడానికి మహేష్ స్వారీ కూడా చెప్పారు. కొంచెం ఓపిక పట్టండి త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని వివరణ కూడా ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం లుక్ రిలీజ్ అయ్యే వరకు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు. నిన్నటి వరకు వియాత్నం లో భారీ యాక్షన్ సీన్ షూట్ చేసిన చిత్రం బృందం సాయంత్రం చెన్నై కి చేరుకుంది. కనీసం రెండు రోజులు కూడా రెస్ట్ తీసుకోకుండా చెన్నైలో ఈ రోజు కొత్త షెడ్యూల్ మొదలెట్టింది. దీన్ని బట్టి చూస్తే అర్ధమవుతుంది.. అభిమానుల కోసం మహేష్ ఎంతలా కష్టపడుతున్నారోనని. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ మూవీ జూన్ 23న థియేటర్లోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus