మహేష్ 25 వ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ ఎప్పుడంటే?

  • July 10, 2018 / 01:46 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర మొదటి షెడ్యూల్  డెహ్రాడూన్ లోని కాలేజ్ లో జరిగింది. రెండో షెడ్యూల్ అమెరికాలో సాగనుంది. త్వరలోనే చిత్ర బృందం అమెరికాకి వెళ్లనుంది. అల్లరి నరేష్ కీలకరోల్ పోషిస్తోన్న ఈ చిత్రానికి  “రాజసం”,  “రైతుబిడ్డ” అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియదు కానీ.. అసలైన టైటిల్ తెలుసుకోవడానికి మరో నెలరోజుల సమయం పడుతుంది. వచ్చే నెల 9 న మహేష్ బాబు పుట్టినరోజు.

ఆరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మహేష్ 25 వ మూవీ టైటిల్ ని రివీల్ చేయాలనీ చిత్ర బృందం భావిస్తోంది. అంతేకాదు అప్పుడే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారని తెలిసింది. ఇప్పటికే బయటికి వచ్చిన షూటింగ్ ఫొటోల్లో మహేష్ మీసం గడ్డంతో స్టైల్ గా కనిపిస్తున్నారు. అతని వేసిన చెక్ షర్ట్స్ కి ఇప్పుడే క్రేజ్ ఏర్పడింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మరింతమంది వార్డ్ రోబ్ లో చేరిపోతుంది.  దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్  ఈ చిత్రానికి అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చే పనిలో ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus