టాలీవుడ్ ట్రేండింగ్… ‘మహర్షి’ టీజర్ డేట్ కోసమే..!

  • March 12, 2019 / 12:59 PM IST

దాదాపు రెండేళ్ళ తరువాత ‘భరత్ అనే నేను’ చిత్రంతో హిట్టందుకున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ వంటి ఘోరమైన డిజాస్టర్లతో మహేష్ మార్కెట్ డౌన్ అయిపోయింది… అని అంతా భావించారు. అయితే ‘భరత్ నేను చిత్రం’ భారీ కలెక్షన్లు సాధించి తన బాక్సాఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు మహేష్. అయితే కొన్ని ఏరియాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కాకపోయినా… మహేష్ కి చాలా రిలీఫ్ ని ఇచ్చిందనే చెప్పాలి. ఇక ప్రతిష్ట్మాకంగా తెరకెక్కుతున్న మహేష్ 25 వ చిత్రమైన ‘మహర్షి’ ఆ లోటుని తీర్చి భారీ హిట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ (మర్చి 12) పూర్తి చేసుకుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెట్టేశారని సమాచారం. ఇక ఈ చిత్ర టీజర్ ను ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న విడుదల చేయబోతున్నారని సమాచారం. నిజానికి ఇదే డేట్ కి మొదట సినిమానే విడుదల చేయాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన మే 9 న విడుదల చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అశ్వినీ దత్, దిల్ రాజు, పొట్లూరి వి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus