బాహుబలి కంక్లూజన్ గురించి మహేష్ బాబు ఏమన్నారంటే ?

  • April 29, 2017 / 11:26 AM IST

బాహుబలి కంక్లూజన్ సినిమా విడుదలయిన తర్వాత భారతీయ చలన చిత్ర కలక్షన్ల లెక్కలు మారిపోయాయి. ట్రేడ్ వర్గాల అంచనాలకు మించి బాహుబలి 2 వసూళ్లను రాబడుతోంది. ఒక్కరోజులోనే వందకోట్లను కొల్లగొట్టి వావ్ అనిపించుకుంది. ఇటువంటి అద్భుత చిత్రాన్ని తెరకెక్కించినందు రాజమౌళిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్నపై ప్రసంశలు కురిపించారు. ఈరోజు ఉదయం షో చూసిన మహేష్ తన అభిప్రాయాన్ని ట్వీట్స్ రూపంలో వెల్లడించారు.

“అమోఘం గా వెండి తెరపై కథలను చెప్పగలిగే రాజమౌళి తిరిగి వచ్చారు. బాహుబలి 2 అంచనాలకు మించి ఉంది.” అంటూ ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా “మైండ్ బ్లోయింగ్ స్టఫ్ ఇందులో ఉంది. రాజమౌళికి, అతని బృందానికి హ్యాట్సాఫ్” అని పోస్ట్ చేశారు. మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఆఖరి టాకీ షెడ్యూల్ మే మొదటి వారంలో హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus