మహేష్ కూతురు పుట్టినరోజు హంగామా మొదలు

  • July 19, 2017 / 05:22 AM IST

మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఈనెల 20 న పుట్టినరోజు జరుపుకోనుంది. ఈ సందడి వారి ఇంట ఇప్పుడే మొదలైపోయింది. మహేష్ భార్య నమ్రత కూతురికి మంచి డ్రస్ సెలక్ట్ చేస్తోంది. నమ్రత పుట్టి, పెరిగింది ముంబైలో అయినప్పటికీ.. తెలుగు సంప్రదాయాన్ని గౌరవిస్తారు. పిల్లలకు మన సంస్కృతిని నేర్పిస్తుంటారు. ఈరోజు సితారను పట్టు పరికిణీలో ముస్తాబు చేసి, ఆ ఫోటోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు ‘5 సంవత్సరాల వైపు ఆమె (సితార)’ అని రాశారు.  సితార గులాబి రంగు పరికిణీ, జడకుచ్చులు, వడ్డానంతో చాలా ముద్దుగా కనిపించింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోది.

సితార చాలా అందంగా ఉందని మహేష్ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు తన చిట్టి తల్లి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు గిఫ్ట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న స్పైడర్ మూవీ సెకండ్ టీజర్ ని గురువారం (20 వ తేదీ) రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus