సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా మూడో షెడ్యూల్ నేడు ప్రారంభమయింది. హైదరాబాద్ లోని బిజీ రోడ్లపై ఛేజింగ్ సీన్ చిత్రీకరణలో ప్రిన్స్ శనివారం పాల్గొన్నారు. భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. పోలీస్ పాత్రధారి అయిన మహేష్ విలన్ ని వెంటాడే సన్నివేశం కోసం మూడు కోట్లు ఖర్చుచేస్తున్నట్లు తెలిసింది.
విశ్రాంతికి ముందు వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్ లో కార్ ఛేజ్ లతో పాటు, బోట్ ఛేజ్ లు కూడా ఉంటాయని సమాచారం. సూపర్ స్టార్ సరసన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాకి హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ దీపావళికి రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.