సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గత వారం నుంచి హైదరాబాద్ లోని పరిసరాల్లో మూడో షెడ్యూల్ చిత్రీకరణ కొనసాగుతోంది. భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.
పోలీస్ పాత్రధారి అయిన మహేష్ విలన్ ని వెంటాడే సీక్వెన్స్ కోసం మూడు కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సంధ్య థియేటర్ పక్కన బస్సు భవన్ లో ఛేజింగ్ ఫైట్ షూట్ చేశారు. ఇందులో ప్రిన్స్ తో పాటు విలన్ ఎస్.జె.సూర్య, కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ సరసన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల పాటు నగర పరిసరాల్లో జరగనున్నట్లు చిత్రబృందం తెలిపింది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ దీపావళికి రిలీజ్ కానుంది.
https://www.youtube.com/watch?v=j4Fb7RbMZpA