ఎవడి కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు.. ఇది పాత డైలాగ్.. ఎవడి కొడితే దిమ్మదిరిగి బ్లాక్ మనీకి మైండ్ బ్లాక్ అవుతుందో అతనే మోదీ.. అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో ఉంది. నల్లధనంపై ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. రజనీకాంత్, కమల హాసన్, నాగార్జున వంటి ఎంతో మంది సినీ స్టార్లు మోదీకి సెల్యూట్ చేశారు.
లేటెస్ట్ గా పండుగాడు స్పందించాడు. అదే నండీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు… పెద్ద నోట్ల రద్దుపై తన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు. “దేశ ఆర్ధిక వ్యవస్థకు ఒక ఆహ్లాదకరమైన మార్పును తీసుకువచ్చారు.. ప్రజల మనిషి – ప్రజల కొరకు – ప్రజల చేత ఎన్నుకోబడిన నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు సెల్యూట్” అంటూ ట్వీట్ చేశారు. అరుదుగా పోస్ట్ లు చేసే మహేష్ బాబు పీఎం కి సెల్యూట్ చేయడంతో ఆయన అభిమానులు చాలా సంతోషించారు.
A refreshing change for our economy & country! Master stroke from the man of the ppl by the ppl for the ppl! Salute you @narendramodi sir! pic.twitter.com/vcl6gqEyvp
— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2016