పోకిరి సినిమాలోని జగడమే అనే పాటలో “గణపతి బప్పా మోరియా” అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే స్టెప్పులు వేసాడు. అదే విధంగా ప్రిన్స్ తనయుడు “జై బోలో గణేష్ మహరాజ్ కీ” అంటూ సందడి చేసాడు. తండ్రి రీల్ లైఫ్ లో వినాయక చవితి వేడుకలలో పాల్గొంటే కొడుకు రియల్ లైఫ్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నాడు. తలకి కాషాయ రిబ్బన్ కట్టి స్నేహితులతో కలిసి దుర్గం చెరువు వద్దకు వెళ్లి తన ఇంట్లో ప్రతిష్టించుకున్న గణపతిని నిమజ్జనం చేశాడు.
మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగులో విరామం రావడంతో మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి కొన్ని రోజుల క్రితం దుబాయ్ కి వెళ్లారు. అక్కడే గౌతమ్ పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. వినాయక చవితి నాటికి నగరానికి తిరిగి వచ్చి ఇంట్లో గణేష్ ప్రతిమను ప్రతిష్టించారు. ఈ పూజలో ప్రిన్స్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. మూడు రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన తర్వాత గురువారం బుధవారం బుజ్జి లంబోదరుడిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఆ సమయంలో మిత్రులతో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విహారం చేస్తోంది.