‘ప్రిన్సెస్’ కి ప్రిన్స్ మహేష్ స్పెషల్ బర్త్‌డే విషస్…

  • July 20, 2017 / 01:59 PM IST

ప్రిన్స్ మహేష్ బాబు…ఈ పేరు వింటేనే వైబ్రేషన్స్ వస్తున్నాయి కదా…అంతేగా మరి…ఎంతైనా రాజకుమారుడు కదా…వరుస హిట్స్ సాధిస్తూ ఇండస్ట్రీలో టాప్ హిట్ అందుకుంటూ దూసుకెళ్తున్న ప్రిన్స్ కి…ఈరోజు చాలా స్పెషల్…ఎందుకంటారా…ఒక సారి మీరే ఈ మ్యాటర్ చదవండి…అసలు విషయం ఏమిటి అంటే…ప్రిన్స్ మహేష్ బాబు నమ్రత సిరొధ్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే…అయితే అదే క్రమంలో వీరికి ఇద్దరు పిల్లలు కూడానూ…అయితే…వాళ్లిద్దరిలో ప్రిన్స్ కూతురు ‘సితార’ పుట్టిన రోజు ఇవ్వాళ…ఇక ప్రిన్స్ ప్రిన్సెస్ కి విషస్ తెలుపుతూ ట్వీట్ చేశాడు..ఆ ట్వీట్ లో తాను ఎం చెప్పాడు అంటే…’తను నా ప్రతిరోజును స్పెషల్‌గా మారుస్తుంది. తనకు ప్రత్యేకమైన ఈ రోజున మరింత ప్రేమ, అంతులేని ఆనందం దక్కాలి.

నా కూతురు ఐదో వసంతంలో అడుగుపెట్టింది’ అంటూ తెలిపాడు. ఇక తన ప్రేమకు సాక్ష్యాలుగా…తనతో ఆనందంగా గడుపుతున్న కొన్ని ఫొటోలను సైతం ప్రిన్స్ ట్వీట్ చేయడం విశేషం…మొత్తంగా కూతురి పై ప్రేమను ఈ రూపంలో చూపించాడు మన ప్రిన్స్…ఇక మరో పక్క సితార బర్త్‌డే కావడంతో మహేష్ బాబు తాజా చిత్రం ‘స్పైడర్‌’ టీజర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి…మరి టీజర్ ఈరోజు రిలీజ్ అవుతుందో…లేక మరో రోజున రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus