హీరోయిన్ విషయంలో నిర్ణయం మార్చుకోనన్న మహేష్ బాబు

  • February 7, 2017 / 10:47 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ షెడ్యూల్ గ్యాప్ లో కొరటాల శివతో స్టోరీ డిస్కషన్ కోసం బ్యాంకాక్ వెళ్లారు. ఈనెల పదవ తేదీ వరకు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి, లాక్ చేయనున్నారు. వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఇందులో హీరోయిన్ గా కొత్త అమ్మాయినే పరిచయం చేయాలనీ ప్రిన్స్ భావిస్తున్నారు. బాలీవుడ్ నుంచి హీరోయిన్ ని దిగుమతి చేసుకుందామని డైరక్టర్ కి సూచించారు. అయితే ఇప్పటికే ఫామ్లో ఉన్న తార అయితే ఎక్కువగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారని,  పైగా డేట్స్ సర్దుబాటు చేయలేరనే విషయాన్నీ మహేష్ కి  కొరటాల సూచించారు.

అలాగైతే ఒకటి రెండు చిత్రాలను చేసిన హీరోయిన్ అయినా, సినిమాల్లోకి రావాలని కలలు కంటున్నా మోడల్ ని అయినా తీసుకోమని స్పష్టం చేసారంట. అంతేకానీ టాలీవుడ్ లో సినిమాలు చేసిన హీరోయిన్ ని మాత్రం తీసుకోవద్దని క్లారిటీగా చెప్పినట్లు డైరక్టర్ సన్నిహితుల ద్వారా తెలిసింది. కథ కొత్త అమ్మాయిని డిమాండ్ చేస్తుందని, అందుకే సూపర్ స్టార్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి మహేష్ పక్కన నటించే ఛాన్స్ అందుకునే ఆ ముంబై ముద్దుగుమ్మ ఎవరోనని మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ బృందం మాత్రం అందమైన హీరోయిన్ కోసం వెతుకులాటలో పడింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus