యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్న ‘మహర్షి’ టీజర్..!

Advertisement

మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ చిత్రం టీజర్ ఈ ఏప్రిల్ 6 న (ఉగాది పండుగ రోజు) విడుదలయ్యింది. ఇప్పుడు ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఈ టీజర్ లో మహేష్ ఓ డైలాగ్ చెప్తాడు. ‘సక్సెస్‌లో ఫుల్‌స్టాప్స్ ఉండవు.. కామాలు మాత్రమే ఉంటాయి’ అనేది ఆ డైలాగ్. ఇప్పటి వరకూ ‘మహర్షి’ టీజర్ ను యూట్యూబ్ లో 1.5 కోట్ల వ్యూస్ ను రాబట్టి రెకార్డ్ సృష్టించింది. ఈ ఫీట్ ను అతి తక్కువ సమయంలో ‘మహర్షి’ టీజర్ సాధించడం ఆశ్చర్యం కలిగించే విషయం.

టాలీవుడ్ లో ఒక్కరోజులోనే 12 మిలియన్ వ్యూస్ వచ్చిన టీజర్ కూడా ‘మహర్షి’ కావడం విశేషం. ట్విట్టర్ లో కూడా ఎక్కువమంది రీట్వీట్ చేసిన, లైక్ చేసిన టీజర్ కూడా ‘మహర్షి’ కావడం గమనార్హం. ఇక ఈ టీజర్‌లో మహేష్‌బాబు చాలా స్టైలిష్ అండ్ క్లాస్ లుక్‌తో కనిపిస్తున్నాడు. ఈ టీజర్లో ‘బిజినెస్ మేన్’ ‘భరత్ అనే నేను’ ‘శ్రీమంతుడు’ ఛాయలు కనిపిస్తున్నప్పటికీ…. మహేష్ ను ఇలా కమర్షియల్ గా చూసి చాలా కాలమైందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను అలరించే విధంగా ఫైట్స్ తో ఈ టీజర్ ను నింపారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్ కి ఓకే హైలెట్ అని చెప్పొచ్చు. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహేష్ బాబు 25 వ చిత్రం కావడం.. అందులోనూ 2019 లో ఇప్పటి వరకూ ‘వినయ విధేయ రామా’ తప్ప మరో పెద్ద సినిమా రాలేదు. కాబట్టి ‘మహర్షి’ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సమ్మర్ కానుకగా మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ‘మహర్షి’ చిత్రానికి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా… భారీ కలెక్షన్లు రావడం ఖాయం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus