నిన్నట్నుంచి ఇంటర్నెట్ లో “వై.ఎస్.షర్మిల పాత్రలో భూమిక” అనే వార్త విపరీతంగా హల్ చల్ చేసింది. ఇంకొందరైతే ఏకంగా షర్మిల-భూమికల పోలుకల గురించి, అసలు భూమిక మాత్రమే ఆ పాత్రను ఎందుకు పోషించాలి అనే విషయాల గురించి డీటెయిల్డ్ ఎక్స్ ప్లనేషన్ కూడా ఇచ్చేశారు. కానీ.. అవన్నీ వృధా అయిపోయాయి. అందుకు కారణం.. “మా సినిమాలో అసలు భూమిక నటించడం లేదు” అని స్వయంగా డైరెక్టర్ మహి వి.రాఘవ ప్రెస్ స్టేట్ మెంట్ రిలీజ్ చేయడం. దాంతో నిన్నటివరకు హడావుడి చేసినవాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు.
రాజశేఖర్ రెడ్డి పాత్రకు మమ్ముట్టిని ఎంపిక చేయడం మినహా మిగతా పాత్రల కోసం ఇంకా ఆడిషన్స్ జరుగుతూనే ఉన్నాయని, వాటి వివరాలు తాను స్వయంగా ప్రకటించే వరకూ ఇలాంటి గాసిప్స్ ను ఎంకరేజ్ చేయవద్దని మహి కోరడం గమనార్హం. అలాగే.. జగన్ పాత్ర కోసం తమిళ నటుడు సూర్య పేరు పరిగణలోకి తీసుకొన్నారు అనే వార్తలో కూడా నిజం లేదని స్పష్టం చేశాడు మహి వి.రాఘవ్.