చైతూ కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్..!

  • April 13, 2019 / 01:02 PM IST

చాలా రోజుల తరువాత నాగ చైతన్యకు ఓ మంచి హిట్టొచ్చింది. వరుస ప్లాపులతో సతమవుతున్న నాగచైతన్య ‘మజిలీ’ చిత్రంతో ఓ సూపర్ హిట్ ను అందుకున్నాడు. ‘షైన్ క్రియేషన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేసాడు. నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 5 న విడుదలయ్యి… మొదటి షో తోనే డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. చైసామ్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ తో ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. మొదటి వారం పూర్తయ్యే సరికి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 25.48 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఈ చిత్రం ఏరియా వైజ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 8.59 కోట్లు
సీడెడ్ – 2.75 కోట్లు
వైజాగ్ – 3.08 కోట్లు


ఈస్ట్ – 1.28 కోట్లు
కృష్ణా – 1.46 కోట్లు
గుంటూర్ – 1.64 కోట్లు


వెస్ట్ – 0.97 కోట్లు
నెల్లూరు – 0.56 కోట్లు


———————————————
ఏపీ +
తెలంగాణ – 20.33 కోట్లు

రెస్ట్ ఆఫ్
ఇండియా – 2.45 కోట్లు
ఓవర్సీస్ – 2.75 కోట్లు
———————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 25.48 కోట్లు (షేర్)
————————————————-

ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ 22 కోట్లు జరిగింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి 25.48 కోట్ల షేర్ ను వసూళ్ళు వచ్చాయి. వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టడం విశేషం. ఇప్పటివరకూ నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్లు వచ్చిన చిత్రం ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ 28 కోట్ల షేర్. ఇప్పుడు ‘మజిలీ’ చిత్రం ఆ కలెక్షన్లను దాటెయ్యడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు. చైతూ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందంటున్నారు. మరి ఫుల్ రన్ లో ‘మజిలీ’ చిత్రం ఎంత వసూల్ చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus