Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Advertisement

లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) స్వతహాగా మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. ‘అందాల రాక్షసి’ తో మంచి డెబ్యూ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత ‘దూసుకెళ్తా’ ‘భలే భలే మగాడివోయ్’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి హిట్లు అందుకుంది.

Lavanya Tripathi

జయాపజయాలతో సంబంధం లేకుండా, స్కిన్ షోకి దూరంగా ఉంటూ తన మార్క్ నటనతోనే లావణ్య ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అలాంటి ఆమె మెగా కోడలు అయ్యిందంటే.. ఆటోమాటిక్ గా క్రేజ్ పెరుగుతుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వరుణ్ తేజ్ ను వివాహం చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలకి మంచి డిమాండ్ పెరుగుతుంది అని అంతా భావించారు.కానీ అలా జరగకపోవడం అందరికీ షాకిచ్చే అంశం.విషయం ఏంటంటే..వివాహం తర్వాత అంటే లావణ్య మెగా కోడలు అయిన తర్వాత లావణ్య ‘సతీ లీలావతి’ అనే సినిమా చేసింది. ‘భీమిలి కబడ్డీ జట్టు’ వంటి మంచి పలు మంచి సినిమాలు తీసిన తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకుడు. కాబట్టి.. ‘సతీ లీలావతి’ బాగుంటుంది అని మొదటి నుండి అంతా అనుకున్నారు.

ట్రైలర్ ని రామ్ చరణ్ లాంచ్ చేయడంతో.. ‘సతీ లీలావతి’ సినిమా గురించి ఇంకాస్త ఎక్కువ మందికి తెలిసింది. అంతకు మించి ఈ సినిమాకి ప్రమోషన్ ఏమీ చేయలేదు అనే చెప్పాలి. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించలేదు. మే 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేయలేదు. ఈ మధ్య చిన్న సినిమాలకి కూడా రెండో రోజు థాంక్స్ మీట్ వంటివి నిర్వహిస్తున్నారు. కానీ ‘సతీ లీలావతి’ కి మేకర్స్ అలాంటివి ఏమీ నిర్వహించలేదు.

తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా కాబట్టి.. అందులోనూ సినిమాలో లావణ్య ఉంది కాబట్టి.. షేరింగ్ పద్దతిలో ఓటీటీకి ఇచ్చేస్తే సరిపోతుంది అని మేకర్స్ భావించి ఉండొచ్చు. దానికి కూడా నామమాత్రంగా థియేటర్ రిలీజ్ చేయాలి కాబట్టి.. చేసినట్టు ఉన్నారు. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటివి నిర్వహించి దానికి చిరంజీవి, వరుణ్ తేజ్ వంటి వాళ్ళు గెస్టులుగా వచ్చి సినిమా గురించి మాట్లాడి ఉండుంటే..నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో కొంత రికవరీ అయ్యుండేదేమో కదా.

సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus