నేల టికెట్ లో ఆసక్తికర రోల్ చేస్తోన్న మాళవిక

  • March 19, 2018 / 09:47 AM IST

మాస్ మహారాజ రవితేజ టచ్ చేసి చూడు సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎస్‌ఆర్‌టీ మూవీస్‌ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ నిన్న రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో జగపతి బాబు రాజకీయనాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇది హీరోకి సమానమైన రోల్ అని తెలిసింది. ఇక హీరోయిన్ మాళవిక శర్మ చేస్తున్న రోల్ గురించి కూడా బయటికి వచ్చింది. మాళవిక శర్మ మెడికల్ కాలేజీ స్టూడెంట్ గా కనిపించబోతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

రవితేజ, మాళవిక శర్మ మధ్య ఉండే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని వెల్లడించారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాకముందే శాటిలైట్ హక్కులు, హిందీ డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలుచేశారు. ఈ రెండు హక్కుల కోసం సన్ టీవీ వాళ్ళు 25 కోట్లు చెల్లించినట్లు సమాచారం. దీన్ని బట్టి రవితేజ మూవీకి ఉన్న క్రేజ్ అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాని రవితేజ త్వరలో కంప్లీట్ చేసి శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించనున్నారు. “అమర్ అక్బర్ ఆంటోనీ” కోసం అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడే నెలపాటు జరిగే భారీ షెడ్యూల్ లో పాల్గొననున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus