విజయం వెనుక పరుగు తీయడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్ గా జరిగే విషయం. అయితే.. ఇటీవల ఆ పరుగు స్పీడు పెరిగింది. ఇదివరకూ ఒక హిట్ సినిమా తీసిన దర్శకుడి చుట్టూ మహా అయితే ఒకరిద్దరు నిర్మాతలు సూట్ కేసులు పట్టుకు తిరగడం అనేది సర్వసాధారణం. కానీ.. “మళ్ళీ రావా” చిత్రంతో సైలెంట్ హిట్ అందుకోవడమే కాక అందరూ మర్చిపోతున్న సుమంత్ కి మంచి కమ్ బ్యాక్ ఫిలిమ్ ను ఇచ్చిన గౌతమ్ కు ఇప్పుడు ఆఫర్లు చుట్టుముడుతుండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఈస్థాయిలో ఆఫర్లని కానీ, క్రేజ్ కి కానీ ఎక్స్ పెక్ట్ చేయని గౌతమ్ ఎవరి ఆఫర్ ను ఓకే చేయాలో, నెక్స్ట్ సినిమాలో ఏ హీరోతో చేయాలో అనే ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అయితే.. మాస్ ఉరమాస్ అంటూ తెలుగులో ఉన్న దర్శకులందరూ కమర్షియల్ సినిమాలవైపు పరుగులు తీస్తున్న తరుణంలో “మళ్ళీ రావా’తో గౌతమ్ తెలుగు ప్రేక్షకుల నెత్తి మీద పాలు పోసాడు. అందుకే.. మిగతా డైరెక్టర్స్ వలె కమర్షియాలిటీ కోసం పరిగెత్తకుండా గౌతమ్ అర్ధవంతమైన కథలతో, మనసుకి హత్తుకొనే కథాంశాలతో మంచి సినిమాలు మాత్రమే తీయాలని ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడు కోరుకొంటున్నాడు.