మొత్తానికి మెగా హీరో సరసన ఆఫర్ కొట్టేసింది?

  • May 27, 2019 / 03:56 PM IST

మాస్ మహా రాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ‘నేల టికెట్’ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది మాళవిక శర్మ. ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో ఈమెకు అవకాశాలు రాలేదు. అయినప్పటికీ ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ పిక్స్ తో కుర్రకారుని హీటెక్కిస్తూ ఉంటుంది ఈ భామ. ఇదిలా ఉండగా ఎట్టకేలకు ఈ అమ్మడికి ఓ క్రేజీ ఆఫర్ దక్కిందని సమాచారం. అవును మెగా హీరో సినిమాలో హీరోయిన్ గా మాళవిక ను ఎంచుకున్నారట.

వివరాల్లోకి వెళితే… మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా మారుతీ డైరెక్షన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మాళవిక ను ఎంచుకున్నారట. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారని తెలుస్తుంది. ఏధైతేనేం… మొత్తానికి మెగా హీరో సినిమాలో ఆఫర్ కొట్టేసింది మాళవిక శర్మ. మరి ఈ చిత్రంతో అయినా ఈమె హిట్టు కొట్టి మరిన్ని ఆఫర్లతో బిజీ అవుతుందేమో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus