హిందీ ‘అర్జున్ రెడ్డి’ సెట్స్ లో వ్యక్తి మరణం..!

  • January 25, 2019 / 12:32 PM IST

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ హీరోగా షాలినీ పాండే హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ చిత్రం తెలుగులో ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంతో హీరో విజయ్ దేవరకొండ, అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాగా పాపులర్ అయ్యారు. ఈ చిత్రాన్ని ప్రస్తుతం తమిళ .. హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళ్ లో చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయమవుతుండగా.. బాలా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

‘అర్జున్ రెడ్డి డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే.. ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తుండగా .. హీరోయిన్ గా కైరా అద్వానీ నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముస్సోరీలో జరుగుతుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో ఓ విషాదం చోటుచేసుకుంది. ఈ చిత్రానికి పని చేస్తున్న రాము(30) అనే వ్యక్తి …. డెహ్రాడూన్ లో ఓ జనరేటర్ కంపనీలో పని చేస్తుంటాడు. ‘కబీర్ సింగ్’ సినిమా షూటింగ్ కి సంబంధించి జనరేటర్ పనులు అన్నీ తనే చూసుకుంటాడు. అయితే ఇటీవల జనరేటర్ కి సంబంధించి ఆయిల్ ని చెక్ చేస్తున్న టైములో… అతని ముఖానికి కట్టుకున్న మఫ్లర్ జనరేటర్ లో ఇరుక్కుపోయింది.. దీంతో అతని ముఖానికి మరియు తలకి బలమైన గాయాలు అయ్యాయి. అక్కడున్నవారు వెంటనే హాస్పిటల్ కి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో… షూటింగ్ ని నిలిపివేశారు. ఇక పోలీస్ ఎంక్వయిరీలో ఇది యాక్సిడెంట్ అని నిర్దారింఛి.. బాడీని పోస్ట్ మార్టంకి తరలించారు. దీంతో సెట్లో ఉన్నవారందరూ దిగ్బ్రాంతికి గురయ్యారని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus