నాగ చైతన్యని ఆటపట్టించిన మంచు మనోజ్.!

  • May 11, 2018 / 01:01 PM IST

సినిమా తారలు కెమెరా ముందు మాత్రమే  ఫైట్స్ తో బయపెడుతుంటారు. నిజజీవితంలో అత్యంత సరదాగా మాట్లాడుకుంటుంటారు. వారి మధ్య సంభాషణలు వినడానికి కుదరదు కానీ.. ఈ రోజు సమంత, నాగచైతన్య, మంచు మనోజ్ మధ్య జరిగిన సంభాషణ బయటికి వచ్చి నవ్వులు పూయించింది. ఆ వివరాల్లోకి వెళితే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సావిత్రి బయోపిక్ బుధవారం రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. ఇందులో సావిత్రిగా కీర్తి సురేష్, ఆమె భర్త జెమిని గణేశన్ గా దుల్కర్ సల్మాన్, జర్నలిస్టులుగా సమంత, విజయ్ దేవరకొండలు చక్కగా నటించి అభినందనలు అందుకుంటున్నారు.

ఇదే విషయాన్నీ చైతూ కూడా ప్రస్తావించారు. “మహానటి సినిమాలో కీర్తి సురేష్,  దుల్కర్ సల్మాన్,  సమంత, విజయ్ దేవరకొండల నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ నిజంగా ఇన్‌స్పైరింగ్” అని అన్నారు. దీంతో వెంటనే సమంత “ఓకే ఓకే. నువ్వు ఇప్పుడు ఇంటికి రా ప్లీజ్” అంటూ పిలిచింది. వీరిద్దరి మాటలను వింటున్న మంచు మనోజ్ (Manchu Manoj) మధ్యలో కల్పించుకున్నారు. “బుక్ అయిపోయావురా.. నా చెల్లెలి చేతిలో” అని పెద్దగా నవ్వేశారు. ఈ మాటలకు సమంత, చైతూనే కాదు అక్కడున్న వారందరూ పెద్దగా నవ్వేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus