మంచు మనోజ్ కథానాయకుడిగా నటించిన “ఒక్కడు మిగిలాడు” రేపు విడుదలవుతోంది. అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎట్టకేలకు రేపు వెలుగుచూడనుంది. ఎల్టీటీఐ ప్రభాకరణ్ జీవితం ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రంలో మనోజ్ రెండు షేడ్స్ ఉన్న పాత్ర పోషించాడు. ఒక పాత్ర కోసం 20 కేజీలు బరువు పెరిగిన మనోజ్.. ఇంకో క్యారెక్టర్ కోసం 10 కేజీలు బరువు తగ్గాడు. బహుశా మనోజ్ ఈ స్థాయిలో కష్టపడిన మొదటి సినిమా ఇదే అనుకుంటా.
చిత్ర బృందం ఎంతో కష్టపడి తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. మరి రిలీజయ్యాక అంచనాల్లో ఏమైనా మార్పులు వస్తాయోమో చూడాలి. అయితే.. ఈ సినిమా విడుదలయ్యాక ఒక ఆరు నెలలపాటు సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్సాయ్యాడట మంచు మనోజ్. ఈ ఆరునెలల్లో కాస్త బరువు కూడా తగ్గి మునుపటి మనోజ్ లా మారేందుకు సన్నద్ధమవుతున్నాడట. ఈ ఆరు నెలలు సినిమాలకు దూరంగా ఉండడం అనే విషయం పక్కన పెడితే.. మనోజ్ సన్నబడి మళ్ళీ “బిందాస్, వేదం” చిత్రాల్లో మనోజ్ లా తయారైతే మాత్రం భలే ఉంటుంది. అలాగే.. రేపు విడుదలవుతున్న “ఒక్కడు మిగిలాడు” హిట్ అవ్వాలని కోరుకొందాం.