Om Bheem Bush: ‘ఓం భీమ్ బుష్’ లో సంపంగి రోల్ చేసింది ఎవరో తెలుసా?

  • March 25, 2024 / 08:30 AM IST

శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఓం భీమ్ బుష్’. ‘హుషారు’ ‘రౌడీ బాయ్స్’ చిత్రాల దర్శకుడు హర్ష దీన్ని తెరకెక్కించడం జరిగింది. మార్చి 22 న రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను రాబట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది. రెండు రోజుల్లోనే రూ.10 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టిన ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎక్కువ డిస్కషన్లే జరుగుతున్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా ‘ఓం భీమ్ బుష్’ లో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ,ప్రియదర్శి…ల పాత్రలకి ఎంత మంచి పేరు వచ్చిందో సంపంగి అనే దెయ్యం పాత్ర పోషించిన నటుడికి కూడా అంతే మంచి పేరు వచ్చింది.

సినిమా కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో, అదీ చివరి అరగంట ఈ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఎమోషనల్ గా కూడా ఉంటుంది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ దెయ్యం పాత్రని డిజైన్ చేయడం వల్ల.. ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు, అవుతారు అని చెప్పాలి. ఈ పాత్ర గురించి ఎక్కువగా చెప్పుకుంటే స్పాయిలర్ అవుతుంది.

అయితే ఈ పాత్రలో కనిపించిన నటుడు మరెవరో కాదు మనీష్ కుమార్. అయానా డాన్స్ కంపెనీలో మనీష్ ఓ క్లాసికల్ డాన్సర్. అందుకే ఈ పాత్రకి అతన్ని ఎంపిక చేసుకున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. సినిమా చూశాక అతని పాత్ర ప్రతి ఒక్కరినీ వెంటాడుతుంది అనే చెప్పాలి. అతని ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus