సూపర్ స్టార్ కృష్ణ కూతురిగా పుట్టడం వల్ల చాలా కోల్పోయానని మంజుల సంచలన కామెంట్స్ చేశారు. నిన్న ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహేష్ బాబు సోదరి ఆసక్తికర సంగతులు వెల్లడించారు. “నేను హీరోయిన్ గా ఎదగాలని కలలు కన్నాను. ఆ కల నెరవేర్చుకోవడానికి కృష్ణ కూతురుగా పుట్టడం అడ్డుగా మారింది” అని మంజుల చెప్పారు. తాను అనుకుని ఉంటే వచ్చిన అవకాశాలను వినియోగించుకుని ఒక టాప్ హీరోయిన్ గా పేరు తెచుకునేదాన్నని గతాన్ని గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబ గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం వాటిల్లకూడదనే హీరోయిన్ ఛాన్స్ వదులుకున్నట్లు పేర్కొన్నారు.
ఆ విషయంలో ఎప్పుడూ తాను బాధ పడలేదని మంజుల స్పష్టం చేశారు. ఇప్పుడు పరిస్థుతులు మారిపోవడంతో పెద్ద కుటుంబాలకు చెందిన అమ్మాయిలు కూడ సినిమా రంగంలోకి వచ్చి ధైర్యంగా హీరోయిన్స్ గా రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. “నా దర్శకత్వంలో వచ్చే మూవీలో నా కూతురు జాన్వీ ని పరిచయం చేస్తున్నాను. ఆ విషయం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది” అని పేర్కొంది. తాను డైరక్టర్ గా మారడం వెనుక తండ్రి కృష్ణ, సోదరుడు మహేష్ బాబు ప్రోత్సాహం ఉందని మంజుల చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.