ఇప్పటి వరకూ ఓకే అనిపించిన ‘మన్మధుడు’..!

  • August 11, 2019 / 08:25 AM IST

అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున నటించిన ‘మన్మధుడు 2’ చిత్రం నిన్న(ఆగష్టు 9న) విడుదలయ్యింది. పక్కా లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘మన్మధుడు 2’ కి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి మంచి వసూళ్ళనే సాధించింది ఈ చిత్రం. నాగార్జున గ్లామర్ తో పాటు వెన్నెల కిశోర్.. రావు రమేష్ ల కామెడీ ఈ చిత్రంలో హైలెట్ గా ఉంది. ఒకానొక సందర్భంలో అయితే వీళ్ళ కామెడీకి థియేటర్లో కుర్చీలు విరిగిపోతాయి అనే రేంజ్లో ప్రేక్షకులు నవ్వుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఓకే మరి ఓవర్సీస్ లో ఈ చిత్రం పరిస్థితి ఏంటి.?

గురువారం యూఎస్ ప్రీమియర్స్ ద్వారా ఈ చిత్రానికి $82,284 గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది. వీకెండ్ కు ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మంగళవారం ఎలాగు ‘వన్ ప్లస్ వన్’ ఉంటుంది కాబట్టి వీలైనంత మొత్తం వసూళ్ళు వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇక శుక్రవారం సాయంత్రం 5:30 గంటల కి ‘మన్మధుడు 2’ $23,766 గ్రాస్ వసూళ్ళను సాధించిందట. దీంతో అక్కడ మొత్తం $123,236 గ్రాస్ సాధించిందని తెలుస్తుంది. మరి వారం పూర్తయ్యేసరికి ఎంత వసూళ్ళు రాబడుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus