అభిమానుల దెబ్బకి దిగివచ్చిన స్టాండప్ కమెడియన్ మనోజ్!

తమిళ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్ ఒకే ఒక్క వీడియోతో మూడు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయాడు. కారణం ఒక్కటే మహేష్ బాబు ని విమర్శించడం. ఓ వేదికపై అతను ప్రదర్శన ఇస్తూ మహేష్ కి నటన కొంచెం కూడా రాదని, కత్రినా కైఫ్ కి మేల్ వర్షన్ అని అవమానించారు. మహేష్ మొహాన్ని బండరాళ్లతో పోల్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అభిమానించే ఓ నటుడిని అవమాన పరచడాన్ని నెటిజనులు తప్పు పట్టారు. అభిమానులు అయితే అతనిపై విరుచుకు పడ్డారు. తమ హీరోని అన్ని మాటలు అంటావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మనోజ్ ఆ వీడియోని యూట్యూబ్ లో నుంచి తీసేసారు.

అయినప్పటికీ మనోజ్ సారీ చెప్పాల్సిందేనని మహేష్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో మనోజ్ దిగివచ్చారు. మహేష్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పారు. “తెలుగు సినిమా అభిమానులకు, మ‌హేశ్‌బాబుకు, మహేశ్ అభిమానులకు… ఇంతకు ముందు చెప్పినట్టు వ్యక్తిగతంగా నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మహేశ్ అభిమానులకు గానీ, అతడికి గానీ, నేను వ్యతిరేకం కాదు. నేను ఎవరినైనా బాధిస్తే సారీ. కావాలని చేసింది కాదు. సిన్సియ‌ర్‌గా సారీ చెబుతున్నా. ఇక్కడితో అంతా సద్దుమణుగుతుందని ఆశిస్తున్నా. (ట్రోలింగ్ ఆగుతుందని ఆశిస్తున్నా)” అని మనోజ్ ప్రభాకర్ సోషల్ మీడియా ద్వారా కోరారు. దీంతో అభిమానులు శాంతించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus